రారా మా ఇంటిదాకా 6

telugu sex stories boothu kathalu ఇంతకీ వడ్డాణం ఎక్కడ పోయిందో ఎంత గింజుకున్నా తట్టడంలేదు.

కారులో సత్రం నుంచి బయల్దేరాక నెల్లూరులో ఓ టీ బంక్ దగ్గర ఆగాం. ఆ తర్వాత గుడి దగ్గర దిగాం. ఈ రెండుచోట్లే పడిపోయే అవకాశం ఉంది. ఇది తెలుసుకున్న అన్నయ్య అదే కారులో నెల్లూరు బయల్దేరాడు. నాన్న, మరో నలుగురు లాంతర్లు తీసుకుని కాలినడకన వెళ్ళారు.

అందరం వాళ్ళకోసం చూస్తూ ఏడుస్తున్నాం ఎవరికయినా శోభనం మాట గుర్తు వచ్చుంటే ఒట్టు. పెళ్ళికొడుకును పట్టించుకొనే నాధుడు లేడు. పెళ్ళి పందిట్లో నానా జోక్ లు వేసిన అతను యింత బాధలో ఒక్కసారయినా వచ్చి పలకరించలేదు. దాంతో అతనిమీద నాకు విపరీతమయిన కోపమూ, అసహ్యమూ కలిగాయి.

వడ్డాణం పోయిందని వినగానే నా దగ్గరికి వచ్చి ‘పోతే పోయిందిలే డియర్ ఆఫ్ట్రాల్ అదెంత? రేపు సాయంకాలానికి కొత్తది తీసుకొచ్చి రాయుడి ముఖాన కొడదాం’ అని అతను అని వుంటే హీరోలా ఫీలయ్యేదాన్నేమో.

మనకు ఎంత వయసొచ్చినా కొన్ని భ్రమలు పోవు. ఆయన కేవలం చిన్న ఉద్యోగి అనీ, ఎనభయ్ వేల రూపాయలను చెల్లించడం అతడికి అసాధ్యమనీ నాకు తట్టలేదు. ఆ విషాదం నుంచి ఎంత తొందరగా బయటపడతామా అన్న ఆత్రుత తప్ప మరొకటి లేదు. క్షణం క్రితం హీరోలా కనిపించిన అతను ఇప్పుడు జీరోలా అనిపించాడు. పరిస్థితుల ప్రభావం అలాంటిది.

బాధతో, టెన్షన్ తో ఎవరికీ నిద్ర రావడం లేదు. అలా గుడ్లప్పగించి చూస్తోంది అమ్మ. వదిన ఏడ్చి ఏడ్చి నిద్రలోకి జారిపోయింది. మా మేనత్త అయితే శవం ముందు కూర్చోని ఏడుస్తున్నట్లు ఏవేవో చెప్పి ఏడుస్తోంది. ఇక నాసంగతి చెప్పనక్కరలేదు. నెల రోజుల నుంచీ లంఖణాలు చేస్తున్నట్లు తీసిపోయాను.

ఒంటిగంటప్పుడు మా అన్నయ్య వచ్చాడు. అందరం ఒక్కసారిగా చుట్టూ మూగాం.

“సత్రమంతా వెదికాను. హోటల్ దగ్గర కూడా చూశాను. ఎక్కడా దొరకలేదు. ఎందుకయినా మంచిదని పోలీస్ రిపోర్ట్ కూడా ఇచ్చాను.”

ఆ కబురుతో అందరం మరింత కుంగిపోయాం. ఇక దొరకదన్న నమ్మకం ఏర్పడిపోయింది. ఏం చేయాలో ఎవరికీ తోచడం లేదు.

రెండు దాటుతుండగా నాన్న వచ్చాడు. ఆయన ముఖం చూస్తేనే విషయం అర్ధమయింది.

“గుడి దగ్గర వెదికాం, రోడ్డంతా వెదుక్కుంటూ పోయాం. ఊహూఁ లాభం లేకపోయింది” అని కూలబడిపోయాడు.

అంతమంది ఉన్నా ఎవరూ మాట్లాడుకోవడంలేదు. అప్పుడప్పుడూ ఎవరికీ తోచింది వాళ్ళు చెబుతున్నారు.

ఆ రాత్రంతా జాగారమే అయ్యింది మాకు. అమ్మ ఓ పక్క నేను ఓ పక్కా, మా వదిన మరోపక్కా కూర్చుని మాలో మేమే ఏడ్చుకుంటున్నాం. నిద్ర మధ్యలో ఉలిక్కిపడి లేచినట్లుంది వదిన. అమ్మ ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తుంటే నామీద నాకే అసహ్యం వేసింది. నా నిర్లక్ష్యం వల్ల యిదంతా జరిగిందన్న గిల్టీ ఫీలింగ్ నన్ను పీక్కుతింటోంది.

నాలుగున్నర ప్రాంతంలో పందిట్లో ఏదో హడావుడి మొదలయింది. అందరం నిస్సత్తువతోనే పైకి లేచాం.

మా మేనత్త పరుగు పరుగున అక్కడినుండి వచ్చి నన్ను వాటేసుకుని “వడ్డాణం దొరికిందే” అంటూ ఊపేసింది.

మంత్రించినట్టు బాధ మాయమై, దాని స్థానంలో ఆనందం పెల్లుబుకుతోంది.

“ఎక్కడ?”

“గుడివెనక వుందట. రాత్రి మీ నాన్న, పూజారి ముందే వెదికారటగానీ వెనక ఎవరూ చూడలేదట. ఇప్పుడు పూజారి లేచి నీళ్ళు తోడడానికి వెనుక వున్న బావి దగ్గరికి వెళుతుంటే కనిపించిందట”

అమ్మా, వదినా చిన్నపిల్లలే అయిపోయారు. ఎక్కడ చేతుల్ని వదులుగా వుంచితే పైకెగిరిపోతుందేమోనన్నట్లు అమ్మ అయితే వడ్డాణాన్ని రెండు చేతులతో గట్టిగా పట్టుకుంది.

అక్కడ ఎవరూ లేకుంటే నాన్న సంతోషం పట్టలేక పల్టీలు కొట్టి వుండేవాడు. అన్నయ్య అందరికీ మరోమారు లడ్లు పంచి పెట్టాడు.

అంతవరకు వున్న టెన్షన్, బాధ మంత్రించినట్లు మాయమయ్యాయి.

వడ్డాణం ఎప్పుడు పడిపోయిందో తెలిసింది. గుడి చుట్టూ ప్రదక్షిణం చేస్తూ అతను నా నడుం మీద చేయి వేసినప్పుడు అది నడుం పులకింతకో ఒంటి జలదరింపుకో ఊడి పడిపోయుంటుంది. ఇదంతా ఆయన మూలంగానే జరిగింది.

అప్పుడొచ్చింది నిద్ర. కనురెప్పల మధ్య అడ్డంగా వున్న స్టిక్స్ ను తొలగించినట్లు వాటంతటవే మూసుకుపోయాయి. మగతగా నిద్రలోకి జారిపోయాను.

ఎవరో నా పెదవుల మీద వేళ్ళ కొసలతో రాస్తున్నట్లనిపించి కళ్ళు విప్పాను. ఎదురుగా నా భర్త ఆనంద్.

“నిద్రా” అని అడిగాడు.

“ఆఁ”

“మన ఫస్ట్ నైట్ ఏ ముచ్చటా తీరకనే ముగిసిపోయింది. యీ రాత్రికైనా…” అంటూ వాలబోయాడు.

నాకు చిర్రెత్తుకొచ్చింది. “ఇదిగో యూ యావవల్లే రాత్రంతా టెన్షన్ తో నరాలు నలిగిపోయాయి. వదలండి – గుడి దగ్గర అంత యావ ప్రదర్శించక గుట్టుగా వుంటుంటే ఈ అనర్ధమే జరగకపోవును అంతా మీ నిర్వాకమే ముందు ఇక్కడినుంచి వెళ్ళండి – మీరు చేయి వేస్తేనే కంపరం పుడుతుంది” అని ఈసడించుకున్నాను.

పాపం మానవుడు ఖంగుతిన్నాడు. ఫస్ట్ నైట్ జరక్కపోగా భార్యచేత అలా తిట్లు తినడంతో చిన్నబుచ్చుకున్నాడు. మౌనంగా వెళ్ళిపోయాడు.

నేను తిరిగి పడుకుండిపోయాను.

ఉదయం ఏడుగంటల వరకు ఎవరూ నిద్ర లేవలేదు. అంత పొద్దెక్కే వరకూ పడుకోవడం మా ఇంట్లో అదే మొదటిసారి. స్నానం చేసి టిఫిన్లు ముగించేసరికి పదయింది.

“అలా నెల్లూరుకు వెళ్లి మ్యాట్నీ చూసి రండి. ఇక్కడ పెళ్ళి కొడుక్కి బోర్ కొడుతూ వుంటుంది” అన్నాడు అన్నయ్య.

దాంతో నేనూ, ఆనంద్ బయల్దేరాం.

తెల్లవారుజామున విసుక్కోవడాన్ని పూర్తిగా మరిచిపోయినట్లు నేను ప్రవర్తించాను.

మొదట్లో ఆయన కొంత విముఖత ప్రదర్శించినప్పటికీ తర్వాత సర్దుకున్నాడు.

హోటల్ లో భోజనం చేసి థియేటర్ కి వెళ్ళాం. చిరంజీవి సినిమా. జనం బాగానే వున్నారు.

టిక్కెట్లు ఇవ్వడానికి ఇంకా టైమ్ వుండడంతో మేమిద్దరం బుకింగ్ దగ్గరగా నిలుచున్నాం.

అంతలో ఓ జంట వచ్చి మా పక్కన నిలబడున్నారు.

ఆమెకి ముఫ్ఫై ఏళ్ల పైమాటే. అతనికి ముఫ్ఫై ఏడేళ్ళుంటాయి రమారమిగా.

వాళ్ళు మాట్లాడుకుంటూ వుండగానే అతనికి మూర్చరోగం వచ్చింది.

చెట్టంత మనిషి మొదలు నరికిన చెట్టులా దభీమని కిందపడిపోయాడు. కాళ్ళూ చేతులూ కొట్టుకుంటున్నాడు.

ఆమె బొడ్లోని తాళాల గుత్తి తీసి అతని చేతిలో పెట్టింది. ఇద్దరు ముగ్గురు చుట్టూ చెరి ఏవో ఉచిత సలహాలు ఇస్తున్నారు.

అంతలో టిక్కెట్లు ఇస్తున్నట్లు బెల్ మోగింది. ఆమె హడావుడి పడిపోయి భర్తను అలానే వదిలి టిక్కెట్ల కోసం కౌంటర్ దగ్గరకు పరుగెత్తింది.

స్త్రీలు కొద్దిమందే వుండడంతో ఆమెకు తొందరగానే టిక్కెట్లు దొరికాయి.

తిరిగి భర్త దగ్గరికి వచ్చింది. అప్పటికి అతని జబ్బు తగ్గింది. లేచి కూర్చున్నాడు.

ఇద్దరూ బాల్కనీకి నడుస్తూండగా ఆనంద్ ఆమె మీద విరుచుకుపడ్డాడు-

“చూశావా! ఆ మహాతల్లి ఏం చేసిందో – మూర్చతో గిలగిల కొట్టుకుంటున్న భర్తని వదిలేసి టిక్కెట్ల కోసం పరిగెత్తింది. ఛీ….. ఛీ”

ఎందుకనో నేను మాత్రం అసహ్యించుకోలేకపోయాను.

సినిమా వదిలాక ఊరికి వచ్చాం.

కాస్తంత రిలాక్సయి, స్నానం ముగించేటప్పటికి ఎనిమిదయింది. మా మేనత్త నా దగ్గరికి వచ్చింది.

“ఇంకా ఏమిటలా కూర్చున్నావ్! లేచి తయారవ్వు. తెల్లచీర కట్టుకో రాత్రి ఆ వెధవ వడ్డాణం వల్ల ఏ ముచ్చటా తీరలేదు” అంటూ తొందర చేసింది.

నేను చీర మార్చుకున్నాను.

తొమ్మిది గంటల ప్రాంతాన గదిలోకి తోశారు ముత్తయిదువులు.

“వెల్ కమ్” అన్నాడు ఆనంద్.

నవ్వుతూ ఆయన దగ్గరికి అడుగులు వేశాను. నేను కూడా ఎప్పుడూ చూసుకోని నా నగ్నత్వాన్ని మరికొద్దిసేపట్లో అతను చూస్తాడని ఊహ రావడంతోనే నాకు తెలియకుండానే సిగ్గు మేఘంలా కమ్మేసింది. తల వంచుకున్నాను.

నా ఎడమ చేయి పట్టుకొని మంచం మీదికి లాగాడు.

పక్కన కూర్చున్నాను. చలికాలం నిప్పుల కుంపటికి దగ్గరగా కూర్చున్నట్లుంది.

“ఈరోజు తెల్లచీరే ఎందుకు కట్టుకోమంటారో తెల్సా?”

తెలియదన్నట్లు తలూపాను.

“రాత్రి గదిలో ఏం జరిగిందో తెలుసుకోవడానికి రంగుల చీర అయితే ఏమాత్రం నలిగిందో తెలుసుకోవడం కష్టం కనుక. మరి పాలు ఎందుకిచ్చి పంపిస్తారో తెల్సా?”

మళ్ళీ తల అడ్డంగా ఊపాను.

“భార్యభర్తల లిద్దరంటే సగపాలు కాబట్టి” అని చమత్కారంగా నవ్వాడు. నాభుజంమీద చేయి వేసాడు.

అప్పటికి సర్దుకున్నాను.

నోటికి పాలు అందించాను. కొంత తాగి కొంత నాకు ఇచ్చాడు.

“రాత్రి చేయి వేస్తేనే కంపరం అన్నావుగా – మరి తీసెయ్యనా?” అంటూ చేయి తీసెయ్యనా?” అంటూ చేయి తీసేయబోయాడు.

మగవాళ్ళు అంతే. తమ భార్యో, ప్రేయసో ఏదయినా అంటే పూర్తిగా అప్ సెట్ అయిపోతారు. బహుశా మేల్ సుప్రమసీ వల్ల కావచ్చు.

దాన్ని క్లియర్ చేసుకుని, తిరిగి పుంజుకునేంత వరకు గిలగిల్లాడిపోతారు.

చేయి తీయకుండా నా చేతులతో అదిమి పట్టుకున్నాను.

“మధ్యాహ్నం థియేటర్ దగ్గర ఒకామె మూర్చరోగం వచ్చిన భర్తను అలా వదిలేసి టిక్కెట్ల కోసం వెళ్ళిందని తిట్టారు కదా”

“అవును”

“కాని ఆమెను నేను అసహ్యించుకోలేకపోయాను”

అతను అర్ధంకానట్లు నావేపు చూసాడు.

“మీరు ఒక కోణంలోంచి చూసి ఆమె ఘోరమైన తప్పు చేసిందని అనుకుంటున్నారు. కానీ మరో కోణంలోంచి ఆలోచించండి. వయస్సు బట్టి చూస్తే వాళ్ళిద్దరికీ వివాహం అయి ఏడెనిమిది సంవత్సరాలయి వుంటుంది. పెళ్ళి అయిన మూన్నెల్లకో ఆర్నేలకో ఆయనకి మూర్చ వచ్చుంటుంది. మొదటిసారి గిలగిలా కొట్టుకుంటున్న భర్తను చూసి ఆమె పడిన ఆందోళన ఇంత అంత వుండదు.

కన్నీళ్ళు కారిపోతూ వుంటే దగ్గరుండి సపర్యలు చేసుంటుంది. ఆయనకీ మూర్చరోగం వుందని, అయితే ప్రమాదం ఏమీ లేదని అత్తా మామలు అప్పుడు చెప్పుంటారు. ఆ నిజాన్ని జీర్ణించుకోవటానికే ఆమెకి చాలాకాలం పట్టుంటుంది.

తిరిగి రెండోసారి పడిపోయినప్పుడు మొదటిసారి పడినంత ఆందోళన పడి వుండదు. పది నిముషాలకి తిరిగి ఆయన లేచి కూర్చుంటాడని తెలియడం వల్ల సహజంగానే కంగారు తగ్గి వుంటుంది. ఇలా ఏడెనిమిది సంవత్సరాలు గడవడంతో అది ఆమెకి మామూలై పోయుంటుంది. అందుకే ఆయన్ని వదిలి టిక్కెట్ల కోసం వెళ్ళుంటుంది.

మనం మొదటిసారి చూస్తున్నామని ఆమెనీ అంత ఆందోళన పడమని అనడం భావ్యమా చెప్పండి”

ఆనంద్ నా వేపు కొత్తగా చూస్తున్నాడు.

“అలానే ఇదీ ఆలోచించండి. పాతిక సవర్ల వడ్డాణం అంటే మాటలు కాదు. అది దొరక్క పోయుంటే కనీసం పది సంవత్సరాలపాటు మా పొలాల్లో పండినదంతా రాయుడికి ఇచ్చేయ్యాల్సి వచ్చేది. అదంతా మీవల్లే జరిగిందని అనిపించి కసురుకున్నాను. అంతే తప్ప మరేం కాదు.”

“నేనూ అర్ధం చేసుకున్నాననుకో”

“మిమ్మల్ని కసురుకున్నాక ఎందుకలా చేసానా అని బాధపడ్డాను. మీవేలు తగిలితే పులకించిపోయిన నేను మిమ్మల్ని అలా కసురుకున్నానంటే అదంతా పరిస్థితుల్లో వచ్చిన మార్పేనన్న విషయం బోధపడింది. నైతిక విలువలుగానీ, సభ్యతా సంస్కారాలు గానీ – ఏవీ వాటికంతటవే ఎగ్జిస్ట్ కావు. అన్నీ ఒకదాని కొకటి ఇంటర్ లింక్డ్. కానీ చాలామంది వేటికి వాటినే విడదీసి చూసి ఎదుటి వ్యక్తుల మీద తీర్పులు చెప్పేస్తుంటారు. మనుషులందరూ మంచివాళ్ళే – పరిస్థితులు చెడ్డవి. ఈ జీవన సత్యం నాకెప్పుడు బోధపడిందో తెల్సా? మిమ్మల్ని తిట్టిన తర్వాత. ఈ సత్యం బోధ పడ్డాక మనుషుల్ని ద్వేషించలేం – ప్రేమిస్తాం”

ఆనంద్ నన్ను విస్మయంతో రెప్పవేయకుండానే చూస్తుండిపోయాడు.

“ఏమిటలా చూస్తారు? ఇది సెకండ్ నైట్ అయినా మనకు ఫస్టు నైట్ లైట్ ఆర్పేయండి” అన్నాను.

మరిన్ని 2018 కొత్త కథలు

గెలుపుకోసం

చదరంగం

ఓ అందమైన లలిత మాలతిల కథ

జన్మనిచ్చిన తల్లి కోసం ప్రయాణం

సునీత- నా కలల రాణి 

నా ముగ్గురు పెళ్లాలు  

ఒక కుటుంబం

ఒక్కసారి అలుసిస్తే!?  

మంత్రాలు – చింతకాయలు

రెచ్చిపోయిన అమ్మాయిలు

అమ్మ-నీ పొదుగు   

కలసి వచ్చిన అదృష్టం

ఫ్యామిలీ కథ చిత్రం 

శృంగార మధనం: సంజయ్

Add a Comment

Your email address will not be published. Required fields are marked *